కుప్పం మండలంలోని పరమసముద్రం సమీపంలో సీఎం చంద్రబాబు కోసం హెలిపాడ్ ఏర్పాటు చేశారు. దీనిని సీఎం సెక్యూరిటీ అధికారులు శుక్రవారం హెలిప్యాడ్ ను పరిశీలించారు. హెలిపాడ్ చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్తో పాటు పోలీసు బందోబస్తు గురించి వివరాలు తెలుసుకున్నారు. హెలిపాడ్ వద్దకు సీఎం కాన్వాయ్ వాహనాల ట్రయల్ రన్ పరిశీలించారు. కుప్పం పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం కానున్నారు.