శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని ఆల్బెటస్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక భవనం ధ్వంసం అయింది. విజయం తెలుసుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ బుధవారం మధ్యాహ్నం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారికి అన్ని విధాల సహాయం చేస్తామని అన్నారు.