కర్నూల్ నగరంలోని సాయి వైభవ్ నగర్‌లో సోమవారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే కాటసాని శివలీల (70) ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య వృద్ధురాలిపై దుండగులు దాడి చేశారు. తలపై బలంగా కొట్టి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతిలో ఉన్న బంగారు గాజులు దోచుకెళ్లారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.వారం రోజుల క్రితం ఇంట్లో పని చేసే పనిమనిషి పని మానేయడంతో, ఈ కోణంపై కూడా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కర్నూల్ మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కూతురు ఉమా