అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు వికారాబాద్ కేంద్రంలో పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హరిత రిసార్ట్స్ మరియు అనంతగిరి వ్యూ టవర్ ని సోమవారం ప్రత్యేకంగా సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత రిసార్ట్స్ పైలెట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞకు అప్పగించినట్లు తెలిపారు అయితే ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత రిసార్ట్స్ ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని మంత్రిస్పష్టం చేశారు