హాలహర్వి మండలం పచ్చరపల్లి గ్రామ ఉపాధి కూలీలకు రెండు వారాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని, సోమవారం పచ్చరపల్లి గ్రామం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టడం జరిగిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు వారాలుగా పనిచేసిన కూలీలకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేయడం జరిగింది అన్నారు.