Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం పరిసర గ్రామాల్లో మంగళవారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో మొత్తం పదివేల ఎకరాల్లో వరి సాగులో ఉండగా కొన్నిచోట్ల పంట వెన్ను దశలో ఉంది. దీంతో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల వల్ల వరి పంట దెబ్బతినే అవకాశం ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. పలు గ్రామాలలోని అంతర్గత రహదారులు బురద మాయంగా మారాయి. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.