తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలో ఆదివారం తరుణ్ అనే వ్యక్తి రాజుపై అనే వ్యక్తి పై కత్తితో దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న వారు అడ్డుకోవడంతో తరుణ్ వెనుతిరిగాడు. ఏడాడి క్రితం వినాయక చవితి ఉత్సవాల్లో జరిగిన చిన్న వివాదమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఈ ఘటన తో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.