ప్రకాశం జిల్లా కొండపి మండలం పన్నూరు గ్రామంలో సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మంత్రి స్వామి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగిస్తుందని వైసిపి దుష్ప్రచారం చేస్తుందని అటువంటివి ఏది జరగడం లేదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో దొంగ సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు తీసుకుంటున్న వారిని వేరువేసేందుకు మాత్రమే ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.