తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఏఏంసి పాలకమండలి సభ్యులు వేలూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందుకు మద్దతుగా దొరవారిసత్రం బిజెపి నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి పరిపాలనలో భారతీయ జనతా పార్టీ దొరవారిసత్రం సీనియర్ కార్యకర్తకు సూళ్లూరుపేట ఏఏంసి డైరెక్టర్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. సూళ్లూరుపేటలో ఏఏంసి చైర్మన్ ఆకుతోట రమేష్, పాలకమండలి సభ్యుల అభినందన సభ ఆదివారం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిధిలుగా కొండేపాటి గంగాప్రసాద్, వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ఏఎంసి పాలక మండల సభ్యులను అభినందించారు. నూతనంగా