Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 8, 2025
వైసీపీ ఆధ్వర్యంలో ఎరువుల కొరతపై ఈ నెల 9న అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆత్మకూరులోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. నాయకులు ప్రతాప్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.