ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామంలో అంగన్వాడి స్కూల్ను తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి మంగళవారం తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్లో మెనూ రిజిస్టర్ను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం పిల్లలకు ఇచ్చే బాలామృతం గుడ్లు, పాలు, బాలింతలకు, గర్భవతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిట్స్ అందుతున్నాయా అని అంగన్వాడీ వర్కర్ను అడిగి తెలుసుకున్నారు.