కుందూ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉయ్యాలవాడ తహశీల్దార్ ప్రసాద్ బాబు సూచించారు. మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నీరు కుందూ నదికి భారీగా వచ్చి చేరుతుందన్నారు. వర్షపు నీటితోపాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసిన నీరు కుందూకు చేరడంతో భారీగా వరద నీరు ప్రవహిస్తోందన్నారు. నీరు తగ్గేంత వరకు ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.