పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఎన్ ఎన్ ఇసి కళాశాలలో భారత అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకొని శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎన్సిసి క్యాడెట్లు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 100 మంది క్యాడేట్లు పాల్గొన్నారు. వారు ఇస్రో సాధించిన విజయాలు చంద్రయాన్ ఆదిత్య ఎల్ వన్ వంటి ప్రాజెక్టుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు ర్యాలీలో క్యాడెట్లు జై జవాన్ జై విజ్ఞాన్ అని నినాదాలు చేశారు.