యాదాద్రి భువనగిరి జిల్లా: రైతుల పంటల సాగుకు సరిపడే యూరియాను అందించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చేడే చంద్రయ్య సోమవారం అన్నారు. ఈ సందర్భంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని రైతులకు యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,సొసైటీల వద్ద క్యూలైన్లు కట్ట నిలబడుతున్న కేంద్ర ప్రభుత్వం యూరియాను రాష్ట్రానికి సరైన సమయానికి అందించడం లేదన్నారు.