శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో నాటు సారా లాటరీలను విక్రయిస్తున్న ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా శనివారం రాత్రి కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి అందించిన వివరాల మేరకు రాబడిన సమాచారంతో కుటాగుళ్ల రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేయగా ఐదు మంది వ్యక్తులు నాటు సారా లాటరీలు విక్రయిస్తుండగా వారిని అరెస్ట్ చేసామన్నారు. 16 లీటర్ల నాటుసార, 47 లాటరీ టికెట్లు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.