ఎల్.ఎన్.పేట మండలాన్ని పలాస జిల్లాలో కలపవద్దని వైసీపీ నాయకులు సంతకాలు సేకరించి మంగళవారం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి అందజేశారు. ఈ సందర్భంగా పలాస వద్దు.. శ్రీకాకుళం ముద్దు అని నినాదాలు చేశారు. పలాస జిల్లాలో ఎల్.ఎన్.పేట మండలాన్ని చేర్చితే అనేక ఇబ్బందులకు గురవుతామని మాజీ ఎమ్మెల్యేకి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎల్.ఎన్.పేట మండలాన్ని ఉంచే విధంగా న్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు.