భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధా కృష్ణన్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరంలోని వీపీఆర్ నివాసంలో డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను గుర్తు చేసుకున్నారు.