మండపేట అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అధికారులు , ప్రజా ప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భోజనం చేస్తున్న వారితో మాట్లాడి నాణ్యత, రుచి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ 5 కే నాణ్యమైన భోజనం అందిస్తున్నారని పేదలు సంతృప్తి వ్యక్తం చేశారు. కమీషనర్ టివి రంగారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అరిటాకు వేసి భోజనాలు అందిస్తున్నామని చెప్పారు