మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. NSS, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవడం ఎంతో ముఖ్యమని, అక్షరాస్యత పెంపుదల కోసం ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రమణయ్య పాల్గొని విద్య ప్రాధాన్యతపై విద్యార్థులకు సూచనలు అందించారు.