ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని అంబేద్కర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంటిలోకి శుక్రవారం ప్రవేశించిన దొంగలు ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. బీరువా పగలగొట్టి అందులో ఉన్న పది సవరణ బంగారాన్ని దొంగలు అపహరించారు. వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిన ఇంటి యజమాని ఇంటికి వచ్చేసరికి దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని సింగరాయకొండ ఎస్సై మహేంద్రా తెలిపారు.