దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సోమవారం పాల్గొని పలు సమస్యలపై కలెక్టర్ వెట్రిసెల్వితో చర్చించారు. ఈమేరకు దెందులూరు నియోజకవర్గ పరిధిలో విభిన్న ప్రతిభావంతుల సదరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. యూరియా కొరత లేకుండా రైతులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.