మెదక్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం పూర్తయేలా పనులలో వేగం పెంచాలని కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీర్ ను ఆదేశించారు.. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 05 కోట్ల రూపాయల వ్యయంతో ఇందిర మహిళా శక్తీ భవనాన్ని నిర్మించుకుంటున్నామని పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళ శక్తి న నిర్ణీత గడువు తేదీలోగా నిర్మించాలని ఆదేశించారు.