మైదుకూరు పట్టణంలోని కడప రోడ్ శివుని మాన్యం వీధిలోకి సరఫరా అవుతున్న మంచినీరు కలుషితమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటికి దుర్వాసన వస్తోందని, తాగడానికి పనికిరాకపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, నీటి సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని వారు మండిపడుతున్నారు.