మెగా జాబ్ మేల కి విశేష స్పందన లభించిందని పులివెందుల జడ్పిటిసి మారెడ్డి లతారెడ్డి అన్నారు. ఆదివారం కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లో డిక్సన్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి పులివెందుల జడ్పిటిసి లతారెడ్డి పాల్గొని ఇంటర్వ్యూలలో ఎంపికైన విద్యార్థులను అభినందించారు.