ప్రస్తుతం డిజిటల్ రంగం నడుస్తున్నది. డిజిటల్ రంగంలో మెరుగైన సేవలు అందించాలని బిజిలీ యాప్ నిర్వాహకులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సూచించారు. కళ్యాణదుర్గంలో శనివారం బిజిలీ యాప్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. డిజిటల్ రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని బిజిలీ యాప్ నిర్వాహకులకు సూచించారు. ఈ ప్రాంత నిరుద్యోగ, యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.