ఆదిలాబాద్ లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మహిళ తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం యాపల్ గూడ గ్రామానికి చెందిన గంగమ్మ అనే మహిళను వినాయక్ చౌక్ లో నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో శ్రీనివాస రామానుజన్ స్కూల్ కు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగమ్మ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది కార్తిక్ సింగ్, శివ కుమారు లు గాయపడ్డ మహిళలు రిమ్స్ కు తరలించారు