బాపట్ల జిల్లా అద్దంకిలోని తిమ్మాయిపాలెం లో పాముకాటు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాట్లాడుతూ మన్నేటి వెంకటేశ్వర్లు 40 సంవత్సరాలు ఉదయం పశువుల మేతకు పొలం వెళ్ళగా పాము కాటుకు గురైనట్లుగా పేర్కొన్నారు. వెంటనే అతను తన బైక్లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి స్పృహ తప్పి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.