ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ గా కమ్మరి పార్వతమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. పార్వతమ్మ గారితో బిసి కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు.బిసి భవన్ లో ఉన్న విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విశ్వబ్రాహ్మణల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్