మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్ జిల్లా నాగారంలో అనారోగ్యంతో ఉన్న సీనియర్ జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు మాధవరం సత్యనారాయణ ను శనివారం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఘనపురం శ్యామ్ సుందర్ వర్మ నివాసంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు .భారతీయ జనతా పార్టీ సంఘ సిద్ధాంతాలపై నడిచే పార్టీ అని అన్నారు. జనతా పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలన్నారు.