మీసేవ,ఆధార్ కేంద్రాల వద్ద అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ-డిస్టిక్ మేనేజర్ దేవేందర్, తాసిల్దార్ రవీందర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఏటూరునాగారం, మంగపేటలోని మీసేవ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాల్లో సిటిజన్ చార్టర్, భూభారతి ఫ్లెక్సీలు, మీసేవ లోగోలు, తాసిల్దార్, ఈడీఎం, టోల్ ఫ్రీ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆపరేటర్లు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.