కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెడిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం కర్నూలు నగరంలోని వక్కెర వాగు ఉద్ధృతంగా పారుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువైపుగా రాకపోకలు బంద్ చేయాలని అధికారులు సూచించారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుండి ప్రవహిస్తున్న వక్కెర వాగు కర్నూలులో ప్రమాదకర స్థాయిలో వెళుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.