అనంతపురం నగరంలోని సాయి నగర్ లో ఉన్న ఓల్డ్ పావని ఆసుపత్రి భవనానికి సంబంధించి ఆస్తి వివాదం పార స్థాయికి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ వివాదం రాజకీయ జోక్యంతో మరింత ముదిరింది. దీంతో ఒకరికి ఒకరు దూషణలు చేసుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు.