*మిలాప్ ఆధ్వర్యంలో మైనార్టీ ముస్లింలకు మిలాప్ ట్రోఫీ 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.* *కాకినాడ:* కాకినాడలో తొలిసారిగా మిలాప్ ట్రోఫీ 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కావడం నిజంగా విశేషమే. జే రామారావు పేటకు చెందిన ఎం.ఎం కమిటీ, హుస్సేన్ – హసేన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడగా, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాన్ నేతృత్వంలో టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు స్థానిక ముస్లిం యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడం, వారిని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకు