రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగానే కొనసాగాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ సహా అన్ని శాఖల కార్యాలయాలు రాయచోటిలో ఏర్పాటు అయ్యాయని, కేంద్రం మార్చే ఆలోచన ప్రజల్లో అనుమానాలు కలిగిస్తుందని పేర్కొన్నారు.జిల్లా సరిహద్దుల్లో మార్పులు చేయరాదని స్పష్టం చేస్తూ, పుంగనూరును అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.