జిల్లా సమగ్రాభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తామని జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడారు. జిల్లా నుంచి వసలను నివారించి, ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా జిల్లా ఏయే రంగాల్లో వెనుకబడి ఉందో పరిశీలించి, ఆయా రంగాల అభివృద్దిపై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. పరిశ్రమలకు భూసేకరణ వేగవంతం చేస్తామన్నారు.