కర్నూలులోని సి. క్యాంప్ సెంటర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో రూ.2.50 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులపై విచారణ జరిపించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చామకూర వీరప్ప డిమాండ్ చేశారు.శుక్రవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టర్ పి. రంజిత్ బాషను కలిసి వినతిపత్రం అందించారు. నిధుల దుర్వినియోగం వల్ల మరమ్మతులు చేపట్టిన మూడేళ్ల లోపు 40 చోట్ల లీకేజీలతో భవనం దెబ్బతిందన్నారు.