ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష ఫీజులు యూనివర్సిటీలో ఒక పద్ధతి ఉంటే కళాశాలలో మరొక పద్ధతిలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదేకాకుండా గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాకు సంబంధం లేదని సెమిస్టర్ ఫీజు కళాశాల ఫీజు కట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.