ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారు జయధీర్ తిరుమల రావు గురువారం పర్యటించారు. కప్పర్ల, తాంసి లో పర్యటించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. రానున్న పొలాల అమావాస్య పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్ల పరిశీలనకు వచ్చానని తిరుమల రావు తెలిపారు. మనిషి, పశువు ఆలింగనం చేసుకునే పండగ పొలాల అమావాస్య అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ అధికారి రవి కుమార్, నాయకులు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.