ఆదోని మండలం దానాపురం గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాల ముందు క్షుద్ర పూజలు కలకలం. శుక్రవారం గ్రామస్తులు పిల్లలు బడికి వెళ్లే చోట ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, గ్రామస్తులు కోరుతున్నారు. పాఠశాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇలాంటి వాటికి పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.