కలసి ఉంటే కలదు సుఖం, రాజి మార్గమే ఉత్తమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ రమేష్ బాబు రాజి మార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ రమేష్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని రాజి పడి కేసుల్లో