భీమవరం 27, 28వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మధ్యాహ్నం రెండున్నరకు మాట్లాడుతూ, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పింఛన్లు అందించడం పారదర్శకతకు నిదర్శనమని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల వద్దకు పాలన, ఐటీ ప్రాధాన్యత, హైవేల నిర్మాణం, విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చంద్రబాబు దార్శనికతకు ప్రతీకగా నిలిచారని వివరించారు.