కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి బుధవారం కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై ప్రత్యక్ష పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమన్నారు.ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఉల్లి రైతులను ఆదుకోవాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేష్ జిల్లా పర్యటనలో జరిగింది శూన్యమన్నారు.ప్రజలు వరాలు కురిపిస్తారని ఆశపడితే చేసింది శూన్యమని తెలిపారు.