నాగలాపురం: మూడు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం నాగలాపురం మండలం చిన్నపట్టు వద్ద అరుణానదిలో ఇసుక తరలించడానికి సిద్ధంగా ఉన్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. నిర్దేశిత సమయంలో ఇసుకను రవాణా చేసుకోవాలని ఉన్నత అధికారులు పదేపదే చెబుతున్నా కొంత మంది ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు. డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో దాడులు చేసినట్లు ఆయన వివరించారు.