నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పూల దుకాణంలో యువకుడిపై కొందరు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఓ పూలదొకాణంలో పనిచేస్తున్న అబ్బాస్ అనే యువకుడు దుకాణం తెరవడంతో కొందరు యువకులు అకస్మాత్తుగా వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాడి చేసిన వారిలో కొందరుపై ఇదివరకే గంజాయి కేసులు నమోదైనట్లు బాధితులు తెలిపారు.