గోదావరి వరదల నేపథ్యంలో పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి కోటిపల్లి నందు ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రాన్ని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ లంక గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.