మహబూబాబాద్ జిల్లా ,పెద్దవంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని రైతులకు ఏ ఇబ్బందిఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.