గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తిర్యాణి ఎంపీడీవో కార్యాలయం ఎదుట CITU ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU నాయకులు తిరుపతి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 51ను సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు కనీసం రూ.26 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.