ములుగు జిల్లాలో గణపతి విగ్రహాల నిమజ్జనాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న శుక్రవారం చివరిరోజు ఘనంగా పూజలు జరిపిన భక్తులు గణపయ్యను సాగనంపారు. జిల్లా కేంద్రంలోని తోగుకుంట, వెంకటాపూర్ మండలాలు, ముళ్లకట్ట వద్ద గోదావరి నదిలో మిగతా మండలాల విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తోగుకుంటలో 150, గోదావరిలో 250 విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నియమించిన అధికారులు, పోలీసులు సమీక్షిస్తున్నారు.