Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: గణేష్ నగర్ లో అనుమతులు లేకుండా నిర్మాణం చేసిన అపార్ట్ మెంట్ ను సీజ్ చేసిన మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు

Karimnagar, Karimnagar | Sep 3, 2025
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు గణేష్ నగర్ లోని నూతనంగా నిర్మిస్తున్న ఓ అపార్ట్ మెంట్ ను బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గణేష్ నగర్ కు చెందిన మహిపాల్ రెడ్డి ప్రభుత్వ, మున్సిపల్ కార్పోరేషన్ అనుమతులు లేకుండా తను నిర్మించిన అపార్ట్ మెంట్ లోని 3, 4, 5 వ ప్లోర్ లను బుధవారం నోటీసులు ఇచ్చి సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏసీపీలు వేణు, శ్రీధర్, మున్సిపల్ అధికారులు సాయి చరణ్, సైయద్ ఖాధీర్, టౌన్ ప్లానింగ్ అధికారులు తేజస్వీని, సంధ్య, నవీన్, సాయి కిరణ్, నదీయా, డిఆర్ఎఫ్ బృందం లక్ష్మణ్, ఇమ్మడోజు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us