నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లెలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శనివారం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కృష్ణ పరమాత్ముడిని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అంబటి రవికుమార్ రెడ్డి ఉన్నారు.